- Advertisement -
నవతెలంగాణ-నెల్లికుదురు
కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కో ఆర్డినేటర్ పెరుమాండ్ల గుట్టయ్యగౌడ్ రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురై వరంగల్ లోని సురక్షా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కాసం లక్ష్మారెడ్డి, గుదే యుగేందర్, గంకిడి ఎల్లారెడ్డి లు సోమవారం ఆయననను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధి కోసం నిరంతర కృషి చేస్తున్న వ్యక్తి, గ్రామాల్లో కార్యకర్తలు పిలిచిన వెంటనే అక్కడికి వెళ్లి ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న వ్యక్తి నేడు అస్వస్థకు గురవడం బాధాకరం అని అన్నారు. ఆయన వీలైనంత తొందరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -



