నవతెలంగాణ – జుక్కల్
భారత విద్యార్థి ఫెడరేషన్ – ( ఎస్ఎఫ్ఐ ) ఆధ్వర్యంలో జుక్కల్ జూనియర్ కళాశాలలో వోకేషనల్ కోర్సులు ప్రారంభించాలి అని కోరుతూ కళాశాల ప్రిన్సిపాల్ శుక్రవారం వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ.. జుక్కల్ మండల ప్రాంతం పూర్తి వెనుకబడిన ప్రాంతంగా ఉందని అన్నారు. కావున పెద్ద పెద్ద చదువు, చదువుతో పాటు వృత్తి విద్య చదువులు కూడా అవసరమని తెలిపారు. అన్ని భావించి పేద మధ్య తరగతి కుటుంబలలో నుండి విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు అని పేర్కొన్నారు.
తక్కువ ఖర్చుతో ఈ విద్యా అభ్యసన ఐపోయితుంది అని సూచించారు. అనంతరం ప్రభుత్వం విభాగం లో ప్రైవేటు విభాగం లో కార్పొరేటు విభాగం లో వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది ఆశభావం వ్యక్తం చేశారు. కావున వారి వారి కుటుంబన్నీ పోసించుకొనే అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు. ప్రభుత్వం ఈ పేద విద్యార్థులకు అండగా ఉండి సహకరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ – ఎస్ఎఫ్ఐ కోరుతున్నారని వినతిపత్రంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు షైక్ ఫిర్దోస్, నాయకులు ఇస్మాయిల్, కరణ్, చౌవన్ విద్యార్థులు , తదితరులు పాల్గోన్నారు.
జూ. కళాశాలలో ఒకేషనల్ కోర్సులు ప్రారంభించాలి: ఎస్ఎఫ్ఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES