దేశంతో ప్రతి చోట ఓటు చోరీ చేసింది బిజెపి
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
నవతెలంగాణ – వనపర్తి
ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో 100 మందితో సంతకాల సేకరణ చేపట్టాలని ఏఐసీసీ ఆదేశించిందని అందులో భాగంగానే వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండలం జయన్న తిరుమలాపురం గ్రామంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ దేశంలో బిజెపి పార్టీ పెద్ద ఎత్తున ఓటు చోరీ చేసి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిందని అన్నారు. త్వరలో ఎన్నికలు జరిగే బీహార్ రాష్ట్రంలో బిజెపి పెద్ద ఎత్తున ఓటు చోరీ చేసిందని, లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆధారాలతో చూపించారని అన్నారు.
ఎన్నికల సంఘం కానీ బిజెపి కానీ రాహుల్ గాంధీ చెప్పిన వాస్తవాలు తప్పు అని చెప్పాలేక పోయరని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 2018 ఎన్నికలలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని, దక్షిణ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా కూడా ఒకే ఒక్క సీటు గెలవడమే ఈవీఎం ట్యాంపరింగ్ కు సూచిక అని అన్నారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తి తన సొంత అభిప్రాయాన్ని కూడా దొంగలించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. బీహార్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఓట్ అధికార యాత్ర చేపట్టి ప్రజలను చైతన్య పరచడంతో ఎన్నికల సంఘం కొత్త ఓటర్ లిస్ట్ ను ప్రకటించిందని అది రాహుల్ గాంధీ విజయమని అన్నారు. చిన్నారెడ్డి గ్రామంలో కార్యకర్తలతో కలిసి100 సంతకాల సేకరణ చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓటు చోరీ కి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టిందని దానిలో భాగంగా జిల్లాలో జయన్న తిరుమలపురంలో సంతకాల సేకరణ చేపడుతున్నామని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టి వాటి అన్నిటిని 15 తేదీన పిసిసికి పంపవలసి ఉంటుందని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్ధన్, వనపర్తి జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు రోహిత్, వనపర్తి యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ రాగి అక్షయ్, వనపర్తి మండల్ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, తాడిపర్తి గ్రామ మాజీ సర్పంచ్ జోగు శాంతన్న, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హరిబాబురెడ్డి, ధర్మారెడ్డి,మెంటే పల్లి రాములు, ఎంట్ల రవి, కొండన్న,విజయ్, గోవర్ధన్,వెంకటేష్, లోకేష్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, బాలేశ్వర్, బండలయ్యా, బొజ్జయ్య యాదవ్, గోవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.