Tuesday, September 30, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఓట్ల దొంగతనం ప్రజాస్వామ్య హత్యే

ఓట్ల దొంగతనం ప్రజాస్వామ్య హత్యే

- Advertisement -

ఈసీ జవాబు చెప్పాలి
నవతెలంగాణ -ముధోల్ 
దేశరాజధానిలోఇండియా కూటమి ఎంపీలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామ్ నాధ్ నాయక్ మంగళవారం ఒక్క ప్రకటనలో ఖండించారు. దేశంలో జరుగుతున్న ఓట్ల తొలగింపు కర్ణాటక లో  1 లక్ష ఓట్లు, బీహార్ లో 58 లక్షల ఓట్లు పై వివరణ కోరిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు విపక్ష ఎంపీలను అరెస్టు చేయడం, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.

ఓటు ప్రజల శక్తి,దానిని దొంగిలించడం అంటే ప్రజా స్వామ్యాకు విరుద్ధంమని అన్నారు. ఎన్నికల సంఘం తన రాజ్యాంగబద్ధ బాధ్యతను వదిలి, కేంద్ర ఒత్తిడికి తలొగ్గి నిశ్శబ్దంగా వ్యవహరించడం అనుమానాస్పదమని ఆరోపించారు. ఎన్నికల సంఘం వెంటనే వివరణ ఇవ్వాలని, పారదర్శకంగా వ్యవహ రించాలని, ప్రజల ఓటు హక్కు రక్షణలో నిష్పక్షపాతం గా ఉండాలని డిమాండ్ చేశారు. ఓట్ల దొంగతనానికి నిరసనగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యా ప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చారని గుర్తుచేశారు. మీ ఓటు మీ భవిష్యత్తు దాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరి గొంతు వినిపించాలని  కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -