Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఓటర్ లిస్ట్ వార్డుల వారిగా తయారుచేసి సిద్ధంగా ఉంచుకోవాలి...

ఓటర్ లిస్ట్ వార్డుల వారిగా తయారుచేసి సిద్ధంగా ఉంచుకోవాలి…

- Advertisement -

– జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్ణాధికారి, మండల ప్రత్యేక అధికారి సాయ గౌడ్..
నవతెలంగాణ- డిచ్ పల్లి
ఓటర్ లిస్ట్ వార్డుల వారిగా తయారు చేసి సిద్ధంగా ఉంచుకోవాలని ,ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా  తప్పులను సరిదిద్దుకొని తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్ణాధికారి, మండల ప్రత్యేక అధికారి సాయ గౌడ్ ఆదేశించారు. సోమవారం డిచ్ పల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో మండల రిషత్ అభివృద్ధి అధికారి రాజ్ వీర్ తో  కలిసి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమ నిబంధన ప్రకారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని, ఓటర్ లిస్ట్ వార్డుల వారిగా తయారుచేసి సిద్ధంగా ఉంచలని పేర్కొన్నారు. ఎక్కడైనా ఎలాంటి పొరపాట్లు జరిగిన ముందస్తుగా అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.అంతకు ముందు మండల కేంద్రంలోని ఘనపూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్, మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పంచాయితీ కార్యదర్శులు బి కవిత, బాలకృష్ణ, గంగాధర్, తోపాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad