Saturday, July 12, 2025
E-PAPER
Homeఖమ్మంఓటరు నమోదు నిరంతర ప్రక్రియ: తహశీల్దార్

ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ: తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని, ఎప్పటికప్పుడు ఎన్నికల కమీషన్ నియమానుసారం విధులు నిర్వహించాల్సి ఉంటుందని తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ తెలిపారు. బూత్ లెవెల్ ఆఫీసర్ లకు శుక్రవారం ఓటు నమోదు పై ఆన్ లైన్ విధానంలో జాతీయ స్థాయీ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైతు వేదిక లో ఎన్నికల విభాగం ఉప తహశీల్దార్ హుస్సేన్ అద్యక్షతన జరిగిన సమావేశంలో మాష్టర్ ట్రైనీ లు బీఎల్ఓ లకు శిక్షణ ఇచ్చారు. ఓటు నమోదు,మార్పులు చేర్పులు,ఇతర రాష్ట్రాల వారు స్థానికంగా ఓటు పొందాలంటే ఏమేమి ఫారాలు పూర్తి చేయాలి,ఓటరు తో ఎలా మెలగాలి అనే అంశాలను వివరించారు. మాష్టర్ ట్రైనీ లుగా పీఎస్ ఎస్వీ ప్రసాద్,వి.సత్యనారాయణ,టి.ఉపేందర్ రెడ్డి లు వ్యవహరించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -