మోహన్ లాల్ నటించిన కొత్త సినిమా ‘వృషభ’. ఈ నెల 25న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా విడుదలవుతోంది. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మించారు. విమల్ లహౌటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను దర్శకుడు నందకిషోర్ మలయాళం, తెలుగులో రూపొందించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. హీరో సమర్జీత్ లంకేష్ మాట్లాడుతూ,’ఇది బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిం. అలాగే లవ్, ఫాదర్, సన్ మధ్య ఎమోషన్ కూడా చాలా ఉంటుంది.
మోహన్ లాల్‌తో నటించేప్పుడు మొదట భయం వేసింది. ఆయనే నన్ను ఎంకరేజ్ చేసి నటించేలా చేశారు. ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్‌కు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈసినిమాని గీతా ఫిల్మ్ రిలీజ్ చేస్తున్నారు’ అని తెలిపారు. ‘భారీ బడ్జెట్‌తో నిర్మించారు. విజువల్స్ గ్రాండ్‌గా ఉంటాయి. కింగ్ ఎపిసోడ్ వచ్చినప్పటి నుంచి సినిమా మరో స్థాయికి వెళ్తుంది. ఫైట్స్, ఎమోషనల్ కంటెంట్ కూడా బాగుంటుంది. నేను దాదాపు 45 నిమిషాల పుటేజ్ చూశాను. సమర్జిత్‌లో ఈజ్ ఉంది. తను కన్నడలో పెద్ద స్టార్ అవుతాడు’ అని ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ చెప్పారు.
విజువల్ వండర్‌గా ‘వృషభ’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



