- Advertisement -
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ పరామర్శించారు. మంగళవారం ఆయన తండ్రి సత్యనారాయణరావు(76) మరణించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లోని హరీశ్‌రావు స్వగృహానికి వారు వెళ్లారు. హరీశ్‌రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్యనారాయణరావు చిత్రపటానికి నివాళి అర్పించారు.
- Advertisement -



