రష్యా-ఉక్రెయిన్ ఘర్షణపై అమెరికా ఆకాంక్ష
కీవ్ : జూన్ నాటికల్లా రష్యా-ఉక్రెయిన్ ఘర్షణ ముగిసిపోవాలని అమెరికా కోరుకుంటోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. ఈ వేసవి ప్రారంభం నాటికి ఉభయపక్షాలు ఈ యుద్ధాన్ని ఆపాలని అమెరికన్లు కోరుకుంటున్నారు. ఈ టైమ్‌టేబుల్‌కు అనుగుణంగానే వారు ఆ పక్షాలపై ఒత్తిడిని పెంచే అవకాశం వుంది.” అని జెలెన్‌స్కీ విలేకర్లతో వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదిత గడువు అమెరికన్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంతో ముడిపడి వుందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతానికి, ఈ యుద్ధం ముగిసిపోయిన తర్వాత ఉక్రెయిన్‌కు భద్రతా హామీలివ్వడానికి ప్రాతిపదికగా నాలుగు డాక్యుమెంట్లు వున్నాయని జెలెన్‌స్కీ చెప్పారు. ఆ నాలుగింటిలో ఉక్రెయిన్, అమెరికా మధ్య కుదిరిన భద్రతా హామీల ఒప్పందం, సుముఖంగా వున్నవారితో కూటమి ఏర్పాటుచేయడానికి ఒప్పందం, యురోపియన్ యూనియన్‌లో ఉక్రెయిన్ సభ్యత్వానికి గల అవకాశాలపై పత్రం, పై మూడింటింతో ముడిపెట్టేలా ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించేందుకు డాక్యుమెంట్ వున్నాయని తెలిపారు.
జూన్ నాటికి యుద్ధానికి తెర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



