Friday, February 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులే కీలకం

గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులే కీలకం

- Advertisement -

శిక్షణ తరగతుల ముగింపులో మండల స్పెషల్ అధికారి
నవతెలంగాణ – మద్నూర్

ఇటీవల జరిగిన గ్రామపంచాయతీల ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన పంచాయతీల వార్డు సభ్యులకు మండల కేంద్రంలోని రైతు వేదికలో శిక్షణ తరగతులు ఐదు రోజులపాటు నిర్వహించారు. శుక్రవారం శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమంలో మద్నూర్ మండల ప్రత్యేక అధికారి అలాగే మండల ఎంపీడీవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యుల గురించి మాట్లాడారు.

గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులు కీలకమని పేర్కొన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వార్డు సభ్యులంతా ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. మొదట బ్యాచ్ గా మండలంలోని 10 గ్రామ పంచాయతీలకు చెందిన 94 మంది వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు ముగిశాయి. ఇక మిగిలిన 11 గ్రామపంచాయతీల 100 మంది వార్డు సభ్యులకు వచ్చే నెల రెండున శిక్షణ తరగతులు ప్రారంభమై హోలీ పండుగ అనంతరం ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాణి ఎంపీ ఓ వెంకట నరసయ్య పది గ్రామపంచాయతీల గ్రామ కార్యదర్శిలు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -