- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
వర్షాలు పడక వానాకాలం పంటలు దెబ్బతింటున్న సందర్భంగా వరుణుడు కరుణించాలని కోరుకుంటూ మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీవాసులు మంగళవారం నాడు భాజా భజంత్రీలతో గ్రామ దేవతలకు జలాభిషేకాలు నిర్వహించారు. ప్రతి ఆలయంలో టెంకాయలు కొడుతూ వరుణుడు కరుణించాలని మొక్కుకున్నారు అనంతరం ఇందిరానగర్ కాలనీలో గల ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం దాత డాక్టర్ బండి, వార్ విజయ్ కి, ఆ కాలనీవాసులు ఆంజనేయ స్వామి, ఆలయం వద్ద ప్రత్యేకంగా సన్మానించారు. ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడైనా తాను మీ వెంటే ఉంటానని కాలనీవాసులకు డాక్టర్ విజయ్ అభయం ఇచ్చారు.
- Advertisement -