- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కౌలాస్ నాళా ప్రాజెక్టు నీటిమట్టం గత కొన్ని రోజులుగా నిలకడగా కొనసాగుతుంది. మంగళవారం ఉదయం నాటికి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లకు గాను 458 మీటర్లు కొనసాగుతోంది. కెపాసిటీ వన్ పాయింట్ టూ త్రీ సెవెన్ టీఎంసీ ఉన్నాయని ప్రాజెక్టు ఏఈ అశ్విని మరియు సుకుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ సాంకేతిక అధికారులు మాట్లాడుతూ ప్రాజెక్టుకు ఎగువ నుండి ఇన్ ఫ్లో 100 క్యూసెక్కులు వస్తున్నాయని ఉన్నారు. అవుట్ ఫ్లో ఎటువంటివి వరద గేట్ల ద్వారా విడుదల చేయడం లేదని, ఎగువ నుండి వచ్చిన నీటిని మెయిన్ కెనాల్ కాలువ ద్వారా 100 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని తెలిపారు.
- Advertisement -