– హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గత కొంతకాలంగా నేలకొన్న నీటి సమస్య ఎట్టకేలకు పరిష్కారం అయ్యింది. కాలనీలో నెలకొన్న నీటి సమస్యను తీర్చేందుకు మంగళవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కాలనీలో ఉన్న బోరు పంపులో 1 హెచ్ పి మోటర్ బిగించారు. బోరు మోటర్ ను సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. బోరు నుండి మోటార్ ద్వారా నీరు బయటకు రావడంతో కాలనీవాసులతోపాటు గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
ఎంతోకాలంగా ఎస్సీ కాలనీ ప్రజలు నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నూతన పంచాయతీ పాలకవర్గం సభ్యుల చర్యలతో కాలనీలో నీటి సమస్య తీరింది. కాలనీలోరి బోరు పంపులు మోటార్ బిగించడం ద్వారా కాలనీవాసులకు నీటి కష్టాలను తీర్చిన సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులకు ఎస్సీ కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగాజమున, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు మామిడి అక్షయ్, మామిడి లక్ష్మి, గుర్రం జమున, మాధవేని లావణ్య, బోల్గాం నవీన్, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.



