Sunday, January 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమేం అమ్మకానికి లేం

మేం అమ్మకానికి లేం

- Advertisement -

అమెరికా హెచ్చరికలకు బెదరం: యూఎస్‌ చెల్లింపు ఆఫర్‌లను తిరస్కరించిన గ్రీన్‌ల్యాండ్‌ చట్టసభ

గ్రీన్‌ల్యాండ్‌ : గ్రీన్‌ల్యాండ్‌ ద్వీపంపై ట్రంప్‌ హెచ్చరికలతో ఆ దేశంలోని పార్టీలు, ప్రజలు తిరస్కరిస్తున్నారు. వూ ఆర్‌ నాట్‌ ఫర్‌ సేల్‌ (మేం అమ్మకానికి లేం) అంటూ ప్లకార్డులు, బ్యానర్లతో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. గ్రీన్‌ల్యాండ్‌లో డెన్మార్క్‌ నుంచి స్వాతంత్య్రం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతుండగా, మరోవైపు యూఎస్‌లో చేరడానికి తీవ్ర వ్యతిరేకతను చూపిస్తున్నాయి. ప్రస్తుత ఫ్రేమ్‌వర్క్‌ల కింద విస్తరించిన యుఎస్‌ సహకారానికి తాము సిద్ధంగా ఉన్నామని సూచించారు, కానీ ద్వీపం అమ్మకానికి లేదని పట్టు బడుతున్నారు.

యూఎస్‌ చెల్లింపు ఆఫర్‌లను గ్రీన్‌ల్యాండ్‌ చట్టసభ సభ్యులు కూడా తోసిపుచ్చారు. డబ్బు కంటే గౌరవాన్ని నొక్కి చెప్పారు ”మేం అమెరికన్లుగా ఉండాలనుకోవడం లేదు. అలాగే డేన్స్‌గా ఉండాలను కోవడం లేదు. గ్రీన్‌ల్యాండ్‌ వాసులుగా ఉండాలనుకుంటున్నాము” అని ప్రకటన పేర్కొంది, ద్వీపం యొక్క స్థితి గురించి నిర్ణయాలు దాని ప్రజలపై మాత్రమే ఆధారపడి ఉన్నాయని నొక్కి చెప్పింది. గ్రీన్‌ ల్యాండ్‌ పట్ల తిరస్కార వైఖరిగా వారు వర్ణించిన దానిని ముగించాలని పార్టీలు వాషింగ్టన్‌ను కోరాయి. ”గ్రీన్‌ల్యాండ్‌ భవిష్య త్తును గ్రీన్‌ల్యాండ్‌వాసులే నిర్ణయించుకోవాలి” అని వారు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -