ఆర్జీయుకేటి విద్యార్థి సంఘం నాయకులు
నవతెలంగాణ – ముధోల్
తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ (టీఏస్ఏఎస్) అధ్యక్షులు, త్రిబుల్ ఐటీ బాసర యునివర్సిటీ విద్యార్థులు కడారి ఆకాష్, ఉపాధ్యక్షుడు అబ్దుల్ ఖాలిక్, కార్యదర్శి జి. యశ్వంత్ లతో కూడిన విద్యార్థి నేతల ప్రతినిధుల బృందం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా వారి నివాసంలో మంగళవారం కలిశారు. 16 అతి ముఖ్యమైన అంశాలతో కూడిన వినతిపత్రం అందజేశామని వారు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ మేరకు టీఎస్ఏఎస్ అధ్యక్షులు ఆకాష్ మాట్లాడుతూ.. మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటి) బాసర విద్యార్థులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు.
విద్యార్థి సమాజాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన ఆందోళనలు, సవాళ్లను ప్రతినిధుల బృందం సిఎం దృష్టికి తీసుకేళ్ళిన్నట్లు చెప్పారు. ఈ సమావేశం బాసర విద్యార్థుల సంక్షేమం, హక్కుల కోసం వాదించడంలో టి ఎస్ ఏ ఎస్ యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుందని పేర్కొన్నారు. మరి ముఖ్యంగా త్రిబుల్ ఐటీ బాసర యూనివర్సిటీలో డిఎస్పి రాజేష్ అరాచకాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ప్రశ్నించిన విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నారని, ఆరోపించారు. చాపతి, అన్నం, కర్రీస్ బాగాలేదని చెప్తే విద్యార్థులను టార్గెట్ చేయడమే కాకుండా యూనివర్సిటీ నుండి సస్పెండ్ చేస్తున్న వైనం నేలకోందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, సీఎం స్పందించి వెంటనే డిఎస్పి రాజేష్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.మా సమస్యలను విన్న సిఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రజాపాలన అంటే ఈ సీఎం ద్వారానే చూస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు.
ప్రజాపాలన అంటే ఎంటో సీఎంలో చూస్తున్నాం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES