నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అంగన్‌వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ం ఆటంకాలు కల్పించడాన్ని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఖండించింది. అంతకు ముందు రోజే కార్యకర్తలను రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఇండ్లకు వెళ్లి అక్రమంగా అరెస్టు చేయడాన్ని తప్పుపట్టింది. ఈమేరకు సోమవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంతటి నిర్బంధాన్ని సైతం లెక్క చేయకుండా అంగన్ వాడీలు ముందుకు సాగారని అభినందించారు. అంగన్‌వాడీ కేంద్రాలను కాపాడాలనీ, కనీస వేతనాలు ఇవ్వాలనీ, పని భద్రత కల్పించాలనీ, కార్మిక హక్కులను రక్షించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ చేరుకున్న టీచర్లు, హెల్పర్లపై పోలీసులు ధమనకాండకు పాల్పడ్డారని తెలిపారు. అరెస్టు చేసిన యూనియన్ నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
అంగన్‌వాడీల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం:ఐద్వా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



