Wednesday, September 24, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపాలస్తీనాను గుర్తించం

పాలస్తీనాను గుర్తించం

- Advertisement -

వాణిజ్య ఒప్పందంపై చైనాతో చర్చిస్తాం : ట్రంప్‌
వాషింగ్టన్‌ : ఓ వైపు అనేక పశ్చిమ దేశాలు పాలస్తీనాను గుర్తిస్తుంటే మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం అందుకు నిరాకరిస్తున్నారు. పాలస్తీనాను గుర్తించడమంటే హమాస్‌కు సాయపడ డడమేనని అధ్యక్ష భవనం తెలిపింది. అనేక యూరోపి యన్‌ దేశాలు పాలస్తీనాను గుర్తించాయి కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు శ్వేతసౌధం పత్రికా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ బదులిస్తూ అలాంటి చర్యను అధ్యక్షుడు గట్టిగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. పాలస్తీనాను గుర్తించినంత మాత్రాను బందీల విడుదల జరగదని, ఘర్షణ ముగియదని, యుద్ధానికి ముగింపు లభించదని ట్రంప్‌ అభిప్రాయపడుతున్నారని ఆమె వివరించారు. పైగా పాలస్తీనాను గుర్తిస్తే హమాస్‌కు బహుమతి ఇచ్చినట్లే అవుతుందని అన్నారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో ట్రంప్‌ తన అభిప్రాయాన్ని సవివరంగా తెలియజేస్తారని చెప్పారు. పాలస్తీనా గుర్తింపు గురించి చాలా మంది మాట్లాడుతున్నారని, కానీ కొందరు స్నేహి తులు, భాగస్వాములు తగిన విధంగా స్పందించడం లేదని లీవిట్‌ వ్యాఖ్యానించారు.

చైనాతో వాణిజ్య ఒప్పందం జరగకపోతే పంటల ధరలు పడిపోతాయని, రైతులు ఇబ్బంది పడతారని విలేకరులు గుర్తు చేయగా ఈ విషయం గురించి ప్రభుత్వానికి తెలు సునని, బీజింగ్‌తో జరిపే చర్చల్లో ఈ అంశాలను ప్రస్తావి స్తామని లీవిట్‌ చెప్పారు. రైతుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుంటోందని అన్నారు. దీనిపై ఇప్పటికే అనేక సమావేశాలు జరిగాయని, వాణిజ్య బృందంతో జాతీయ ఆర్థిక మండలి, వ్యవసాయ మంత్రి బ్రూక్‌ రోలిన్స్‌ చర్చిస్తున్నారని వివరించారు. తాజా అణ్వాయుధ ఒప్పందాన్ని మరో సంవత్సరం పొడిగిం చాలన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సూచనపై ఆమె మాట్లా డుతూ ఆ ప్రతిపాదన గురించి ట్రంప్‌కు తెలుసని, అది మంచిదేనని ఆయన అంటు న్నారని తెలిపారు. వెనిజులా నేత మదురో పంపిన లేఖను ట్రంప్‌ సమీక్షి స్తున్నారని అన్నారు. ఆ లేఖలో అనేక అబద్ధాలు ఉన్నా యన్న వాదనను ఆమె తోసిపు చ్చారు. అయితే మదురో ప్రభుత్వ పాలన చట్టవిరు ద్ధమని, మాదక ద్రవ్యాల రవాణాతో దానికి సంబంధం ఉన్నదని అమెరికా చేస్తున్న ఆరోపణను ఆమె పునరుద్ఘాటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -