Tuesday, April 14, 2026
E-PAPER
Homeసినిమాఓ మంచి సినిమా తీశామనే సంతృప్తి ఉంది

ఓ మంచి సినిమా తీశామనే సంతృప్తి ఉంది

- Advertisement -

హీరో అడివి శేష్‌ నటించిన చిత్రం ‘డెకాయిట్‌. శేష్‌ సరసన మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించారు. షానియల్‌ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్‌ నారంగ్‌ సహ నిర్మాతగా వ్యవహరించారు.
ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత సుప్రియ యార్లగడ్డ మీడియాతో ముచ్చటించారు.
మా సినిమాకి వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే చాలా హ్యాపీ. ఆడియన్స్‌ నుంచి వచ్చే రెస్పాన్స్‌ మనసుకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
తెలుగుతోపాటు హిందీలోనూ రెస్పాన్స్‌ చాలా బావుంది. తెలుగులో తీసిన సినిమా అక్కడికి చేరడం చాలా ఆనందంగా ఉంది. హిందీలో లాంగ్‌ రన్‌ ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ సినిమాని తమిళం, మలయాళం, కన్నడలో కూడా డబ్‌ చేశాం. కాకపోతే ఆ డబ్‌ ఓటీటీకి పరిమితంగా ఉంటుంది. సినిమాని కేరళలో దుల్కర్‌ సల్మాన్‌ బ్యానర్‌ ద్వారా రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమాలో పవన్‌ సింగ్‌, జోనితా లాంటి స్టార్స్‌ వుండటం వలన నార్త్‌లో చాలా హెల్ప్‌ అయ్యింది.
మంచి సినిమాకి ఎప్పుడూ రిస్క్‌ వుంటుంది. ఈ సినిమాకి క్లైమాక్స్‌ అందం. ఈ కథని నిజాయితీగా చెప్పాలనుకున్నాం. చాలా మంది క్లైమాక్స్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -