Saturday, January 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమున్సిపల్‌ ఎన్నికల్లోనూ జయకేతనం ఎగరేయాలి

మున్సిపల్‌ ఎన్నికల్లోనూ జయకేతనం ఎగరేయాలి

- Advertisement -

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మున్సిపల్‌ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) సన్నద్ధమవుతున్నది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మున్సిపల్‌ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వరుసగా ఉమ్మడి జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. మున్సిపాల్టీల వారీగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో మున్సిపల్‌ ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగురవేయాలని పార్టీ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పాలనను ప్రజలు తిరస్కరించారని చెప్పారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, అడ్డదారులు తొక్కినా నాలుగు వేలకుపైగా సర్పంచ్‌ స్థానాలను బీఆర్‌ఎస్‌ గెలిచిందన్నారు.

రెండేండ్ల కాంగ్రెస్‌ పాలన ఇచ్చిన హామీల్లో మోసం, పరిపాలన వైఫల్యంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చాతకాని పాలనతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని చెప్పడానికి ఈ ఫలితాలే ప్రత్యక్ష సాక్ష్యమని చెప్పారు. వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీకి ఇంతకన్నా పెద్ద ఎదురుదెబ్బ తప్పదని స్పష్టం చేశారు. రెండేండ్లలోనే అధికార పక్షంపైన ఇంత తీవ్రమైన వ్యతిరేకత రావడం ఎప్పుడూ చూడలేదని అన్నారు. పార్టీ శ్రేణులంతా శక్తి వంచన లేకుండా గులాబీజెండాకు పూర్వ వైభవం తెచ్చేందుకు సరిహద్దుల్లో పనిచేసే సైనికుల్లాగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణాల్లో నెలకొన్న సమస్యలను ప్రజల ముందు ఉంచాలని కోరారు. పారిశుధ్యం నుంచి మొదలుకొని వీధిదీపాల వరకు అన్ని అంశాల్లో కాంగ్రెస్‌ చేతులెత్తేసిందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పాలనలో పట్టణాల్లో కొత్తగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని వివరించారు. మున్సిపాల్టీలు సమస్యలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయన్నారు.

రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌గా కాంగ్రెస్‌ ప్రభుత్వం
రాష్ట్రంలో విద్యాసంస్థల భూములను తీసుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌గా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారక రామారావు (కేటీఆర్‌) విమర్శించారు. వర్సిటీల భూములను గుంజుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో నందినగర్‌లోని తన నివాసంలో మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) విద్యార్థులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -