Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటింటికి తిరిగి నీరు నిలవగల ప్రాంతాలను గుర్తించాలి..

ఇంటింటికి తిరిగి నీరు నిలవగల ప్రాంతాలను గుర్తించాలి..

- Advertisement -

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
జిల్లా మలేరియా అధికారి తుకారాం రాథోడ్..
నవతెలంగాణ – డిచ్ పల్లి

ఇంటింటికి తిరిగి నీరు నిలవగల ప్రాంతాలను గుర్తించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా మలేరియా అధికారి తుకారాం రాథోడ్ సూచించారు. గురువారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని సామాజిక ఆసుపత్రి లో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ ఆశా కార్యకర్తల నెల వారి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఈ నెల కీటక జనిత వ్యాదుల నివారణ కోసం  ఇంటింటికి తిరిగి  నీరు నిలవగల ప్రాంతాలను గుర్తించాలని, జ్వరంకు సంబంధించి రక్త పరీక్షలు చేయాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధులలో ఈగలు, దోమల వల్ల కలిగే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని,దోమల వల్ల కలిగే వ్యాధులైన మలేరియా డెంగ్యూ,చికున్ గున్యా,ఫైలేరియా, మెదడు వాపు  లాంటి వ్యాధులు అరికట్టడానికి పరిసరాల పరిశుభ్రత పాటించే విధంగా ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.

100 ఇండ్ల చుట్టూ గల పరిసర ప్రాంతాలలో డెమో పాస్ స్ప్రే చేయాలని,ఇంటింటికి జ్వరం సర్వే ఆశా కార్యకర్తలచే నిర్వహించలని, ప్రతి శుక్రవారం నిర్వహించే ఇంటింటి కార్యక్రమం ముందస్తు ప్రణాళికలను సిద్ధంగా ఉంచుకోవాలని, లార్వా నివారణ కొరకు వాడే టెమోఫాస్ ను అందుబాటులో ఉంచుకోవాలని, డెంగ్యూ కేసు వచ్చిన గ్రామంలో నాలుగు వారాలపాటు ఇంటింటికి తిరిగి నీరు నిలవగల ప్రాంతాలను గుర్తించాలని, ఆహారం ఆరోగ్యం వాష్ చేతులు కడుక్కునే పద్ధతి ల గురించి వివరించలన్నారు. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం ఉంటుందని అన్ని విటమిన్లు కలిగిన తాజా ఆకుకూరలు, కూరగాయలు చిక్కుడు జాతుల గింజలు, మొలకెత్తిన విత్తనాలు నారింజ, నిమ్మ విటమిన్ సీ కలిగిన పదార్థాలు, విటమిన్ డి కొరకు ఉదయం సాయంత్రం వేళ సూర్యరశ్మీ తగిలేలా వ్యాయామం చేయాలని, కాల్షియం అధిక మోతాదులో గల పాలు గుడ్లు తీసుకోవాలని, రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు అయితే మునగ ఆకు,బెల్లం పట్టీలు,తాజా ఆకుకూరలు, క్యారెట్లు, బీట్రూట్ లు అధికంగా తీసుకోవాలని తెలిపారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయ్యేలా అందరిని ప్రోత్సహించాలని, సాధారణ ప్రసవానికి ప్రోత్సహించాలని సాధారణ ప్రసవం, శస్త్ర చికిత్స మధ్య తేడాలను తెలపాలని వివరించారు. సాధారణ ప్రసవం వలన కలిగే లాభాలు శస్రచికిత్స వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలని తెలిపారు.

మరుగుదొడ్డి వాడిన తర్వాత ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చేతులు కడుక్కునే పద్ధతులు ఆరు రకాల పద్ధతులు వాడాలని వివరించారు. చేతులు శుభ్రంగా కడుక్కోనట్లయితే చేతుల ద్వారా నులిపురుగులు శరీరంలోకి ప్రవేశించి మనం తీసుకున్న ఆహారం నులిపురుగులు తినడం వల్ల పోషకాహారం లోపం, రక్తహీనత వస్తుందన్నారు. దంపుడు బియ్యం తీసుకోవడం ద్వారా విటమిన్ బి కాంప్లెక్స్ అధికంగా లభిస్తుందని పాలిష్ బియ్యం వాడరాదని తెలిపారు. సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి సాధారణ వ్యాయామం నడక మంచి అలవాట్లు నేర్చుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని వివరించారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చేయాలనీ సూచించారు. మానసిక శారీరక ఆరోగ్యం కొరకు ఖచ్చితంగా శారీరక శ్రమ చేయాలని తెలిపారు. సాధారణ ప్రసవం కొరకు తగిన యోగ చేయాలని గర్భిణీ స్త్రీ లచే చేయించారు. గర్భిణీ స్త్రీ లు పౌష్టికాహారం తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, పాలు తీసుకోవాలి. ఐరన్ ఫోలికాసిడ్ మాత్రలు వేసుకోవాలని తెలిపారు. ఆశా కార్యకర్తలు ఖచ్చితంగా గర్భిణీ స్త్రీ లచే ఐరన్ ఫోలిక్ ఆసిడ్ మాత్రలు తినిపించాలని తెలిపారు. ప్రతి సోమవారం, మంగళవారం అమ్మఒడి ని ఉపయోగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యధికారి డాక్టర్ షారోన్ షైని క్రిస్టినా,  జిల్లా ఆరోగ్య భోధకులు స్వామి సులోచన,మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ , ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ అలీ, దేవపాలం, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -