Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాకు కూడా చీరలు ఇవ్వాలి 

మాకు కూడా చీరలు ఇవ్వాలి 

- Advertisement -

గ్రామపంచాయతీకి తాళం వేసినా మహిళలు
మిర్యాలగూడ మండలంలో సంఘటన 
నవతెలంగాణ – మిర్యాలగూడ 

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న చీరలు తమ కూడా ఇవ్వాలని ఓ తండ మహిళలు గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం వేసి అక్కడే నిరసన తెలిపిన సంఘటన మంగళవారం మిర్యాలగూడ మండలంలో చోటుచేసుకుంది. వివరాలకు వెళ్లితే… మిర్యాలగూడ మండలంలోని కుంట కింద తండాలో సుమారు 150 కు పైగా మహిళలు ఉన్నారు. కానీ సమాభవన సంఘంలో కేవలం 30 మంది మాత్రమే సభ్యులుగా ఉన్నారు. స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్న మహిళలకు, ప్రతి ఒక్క మహిళకు ప్రభుత్వం నాణ్యమైన చీరలు అందించాలని ఆదేశించింది.

కానీ తండాలో ఉన్న 30 మంది సంఘం సభ్యులకు చీరలు అందించారు.  మిగిలిన సాధారణ మహిళలకు చీరలు ఇవ్వకపోవడంతో మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం వేసి అక్కడే నిరసన తెలిపారు. మాకు కూడా చీరలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మహిళలందరికీ చీరలు ఇవ్వాలని చెప్పిందని కానీ గ్రామంలో కేవలం మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే చీరలు ఇచ్చారని ఆరోపించారు. మాకు కూడా చీరలు ఇవ్వాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -