- Advertisement -
నవతెలంగాణ- నవీపేట్: రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా ప్రధాని మోడీ తల్లిని అవమానిస్తూ బీహార్ కాంగ్రెస్ సమావేశంలో అసభ్యకర నినాదాలు చేస్తూ దిగజారుడు రాజకీయం చేయడం మానుకోవాలని బీజేవైఎం మండల అధ్యక్షులు బండారి రాజశేఖర్ అన్నారు. జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు బిజెపి జిల్లా కార్యదర్శి మాజీ ఎంపీటీసీ మైస రాద, బండారి రాజశేఖర్ లను ఆదివారం ముందస్తు అరెస్టులు చేశారు. భారతీయ సంస్కృతి, విలువలను దిగజారే విధంగా రాహుల్ గాంధీ ప్రవర్తించడం సిగ్గుచేటని వెంటనే రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
- Advertisement -