- Advertisement -
బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే
నవతెలంగాణ – పాలకుర్తి
పాలకుర్తి నియోజకవర్గం లోని గ్రామాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారానికి బాలవికాస ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ లో గల ఫాతిమా నగర్ బాలవికాస కార్యాలయంలో బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌ రెడ్డిని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కలిసి త్రాగునీటి సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు. శుద్ధి త్రాగునీరును అందించి ప్రజల ఆరోగ్య రక్షణకు బాసటగా నిలవాలని తెలిపారు. స్పందించిన శౌ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం బాలవికాస ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
- Advertisement -