వర్ధంతి సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి
నవతెలంగాణ – గోవిందరావుపేట
సీతారాం ఏచూరి స్ఫూర్తితో ఉద్యమించాలని, ఏచూరి మరణం భారతదేశ ప్రజలకు తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం సీపీఐ(ఎం) అఖిలభారత మాజీ కార్యదర్శి సీతారం ఏచూరి ప్రధమ వర్ధంతి సభ సీపీఐ(ఎం) గ్రామ కమిటీ కార్యదర్శి కడారి నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి జిల్లా కార్యదర్శి బి రెడ్డి సాంబశివ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ సీతారాం ఏచూరి ఉన్నత విద్యావంతుడని అన్నారు. మార్క్సిజన్ని అవపోసన పట్టిన మహామేధావి అని కొనియాడారు. భారతదేశంలో యూపీఏ గవర్నమెంట్ లో దేశ ప్రజల సంక్షేమం కోసం ఉపాధి హామీ చట్టం,సమాచార హక్కు చట్టం,అటవీ హక్కుల చట్టం,రూపకల్పనలో ఆయన పాత్ర మరువలేనిదని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగ ద్వారా సంక్రమించిన హక్కుల కోసం పార్లమెంట్లో గలమెత్తిన ఉత్తమ పార్లమెంటేరియన్ అని అన్నారు. ప్రజలందరి జీవితాల్లో వెలుగు నింపాలని కలలు కన్నారని తెలిపారు. ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వం కోసం అనేక పోరాటాలు రూపకల్పన చేసిన సైద్ధాంతిక వేత్త అని పేర్కొన్నారు. ఈ దేశంలో సమ సమాజం కోసం ఆయన తన చివరి చమరాంకం వరకు పోరాడారని అన్నారు. అలాంటి మహా నాయకుడిని ఆదర్శంగా తీసుకొని నేటి పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు పదును పెట్టాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. భవిష్యత్తులో పోరాటాల ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకోసం కార్యకర్తలందరూ రానున్న స్థానిక ఎన్నికల్లో రాజకీయ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
పసర సీపీఐ(ఎం) సర్పంచ్ అభ్యర్థి గొంది రాజేష్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. గ్రామంలో సీపీఐ(ఎం) చేసిన పోరాటాలను ప్రజలకు వివరించాలని అదేవిధంగా గత గ్రామపంచాయతీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటరెడ్డి ,చిట్టిబాబు, జిల్లా కమిటీ సభ్యులు గొంది రాజేష్, తీగల ఆగిరెడ్డి మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి, శాఖా కార్యదర్శులు అంబాల మురళి ,పురుషోత్తం రెడ్డి,పల్లపు రాజు, గొర్ల శీను, అశోక్ గజ్జి నరసయ్య, డాక్టర్ ఐలయ్య, బ్రహ్మచారి,రమేష్, కవిత,సువర్ణ, రాజేశ్వరి,సమ్మక్క,సరళ, రమాదేవి, ధర్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సీతారాం ఏచూరి స్ఫూర్తితో ఉద్యమించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES