జిల్లా విద్యాశాఖ అధికారి ఏ సిద్ధార్థ రెడ్డి
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు మంగళవారం నాడు ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ సిద్ధార్థ రెడ్డి ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా డీఈఓ సిద్ధార్థ రెడ్డి పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖి అయి విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించి గణితంలో మెలకువలను తెలియజేయడం జరిగింది. అనంతరం విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను ఉద్దేశించి డీఈవో మాట్లాడుతూ.. పదవ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో 17 నుండి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధులను చేయాలని అన్నారు.
జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు ములుగు ద్వారా నిర్వహించబడుతున్న అటువంటి 50 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులలో విద్యార్థులకు ఉత్తమ ఫలితాల సాధనకు తరఫున ఇవ్వాలని వారు అన్నారు. అభ్యసనలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని అనుపస్థితి అవుతున్నటువంటి విద్యార్థుల కు వెళ్లి తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని వారు అన్నారు. పదవ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రస్థాయిలో ముందు వరుసలో ఉంచాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్ శ్యాంసుందర్ రెడ్డి,ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు వనజ రాణి,వెంకటలక్ష్మి, ఎమ్మార్సీ సిబ్బంది విష్ణు.పాల్గొన్నారు.



