Tuesday, February 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రజకులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం..

రజకులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం..

- Advertisement -

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
నవతెలంగాణ – మల్హర్ రావు

నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఇటీవల జరిగిన రజక కులస్తులు ఐన గణేష్ చంద్రకళ మౌనికపై అదే గ్రామ సర్పంచ్ తుకారం రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధురెడ్డి అంతా రాయలేని భాషతో బూతులు తిడుతూ దురంకారంతో అతికిరాతకంగా భయంకరంగా వారిపై దాడి చేసి, రెండు నెలల పసిబిడ్డపై కాళ్లతో తన్ని చంపారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా జాతీయ బిసి సంఘం జిల్లా ఇంచార్జి విజయగిరి సమ్మయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెడ్ల అహంకార సంఘటన బడుగు బలహీన వర్గాలపై ఇంకా ఎన్ని సంవత్సరాలు దాడులు చేస్తారని ప్రశ్నించారు.రాష్ట్రంలో ఎంపీ ఆర్.కృష్ణయ్య, తీన్మార్ మల్లన్న, విశరాదన్ మహారాజ్, బీసీ సంఘo నాయకులు అందరూ కుటుంబానికి అండగా ఉన్నారన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -