Sunday, November 2, 2025
E-PAPER
Homeసినిమా'బైకర్‌' కోసం చాలా రిస్క్‌లు, ఛాలెంజ్‌లు తీసుకున్నాం

‘బైకర్‌’ కోసం చాలా రిస్క్‌లు, ఛాలెంజ్‌లు తీసుకున్నాం

- Advertisement -

శర్వా నటిస్తున్న స్పోర్ట్స్‌, ఫ్యామిలీ డ్రామా ‘బైకర్‌’ చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌ నిర్మించింది. శనివారం ఈ సినిమా ఫస్ట్‌ ల్యాప్‌ గ్లింప్స్‌ను మేకర్స్‌ లాంచ్‌ చేశారు. హీరో శర్వా మాట్లాడుతూ,’ఇందులో నటించిన రాజశేఖర్‌కి థ్యాంక్స్‌. ఇది ఫస్ట్‌ మోటోక్రాస్‌ రేసింగ్‌ ఫిల్మ్‌ ఇన్‌ ఇండియన్‌ సినిమా. గ్లింప్స్‌లో కనిపించినది ఏది కూడా సీజీ షాట్‌ కాదు. ఒరిజినల్‌ బైకర్స్‌తో తీసిన ఒరిజినల్‌ స్టంట్స్‌. ఇండోనేషియా వెళ్లి బైకర్స్‌తో అక్కడ చిత్రీకరణ చేసి వచ్చాం. చాలా రిస్కులు, ఛాలెంజ్‌లు తీసుకున్నాం. ఒక గొప్ప సినిమా చేశామని గర్వంగా చెప్పుకోగలం. ఈ సినిమా నా కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌. ఇలాంటి సినిమా చేయాలంటే నిర్మాతలకి గట్స్‌ ఉండాలి. అభి అద్భుతమైన కథ రాశారు. ఫెంటాస్టిక్‌గా తీశాడు’ అని తెలిపారు.
‘ఇది అద్భుతమైన సబ్జెక్టు. ఈ సినిమా చేస్తే మంచి పేరు వస్తుందని ఒప్పుకున్నాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది’ అని రాజశేఖర్‌ చెప్పారు. డైరెక్టర్‌ అభిలాష్‌ రెడ్డి కంకర మాట్లాడుతూ,’ఇది జస్ట్‌ గ్లింప్స్‌ మాత్రమే. దీన్ని థియేటర్స్‌లో స్క్రీన్‌ చేసినప్పుడు చాలా అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. రేసింగ్‌ సినిమాలు చూసి మీరు ఎంత ఎక్సైట్‌ అయ్యారో దానికి ఇది మించినట్లుగా ఉంటుంది. డిసెంబర్‌ 6న విడుదల చేస్తున్నాం’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -