– తెలంగాణ జన సమితి..
నవతెలంగాణ – కామారెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సహకరిస్తున్నమని తెలంగాణ జన సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కుంభాల లక్ష్మణ్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు తెలంగాణ జన సమితి తరపున ముఖ్యమంత్రికి, బిసి మంత్రిత్వ శాఖకు, ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా పక్కడ్బందీగా జీవో అమలయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొరాడం జరుగుతుందనీ, ఈ బిల్లును అడ్డుకునేవారు తమ ప్రయత్నాన్ని వెంటనే మానుకోవాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ న్యాయమైన డిమాండ్ అని, దయచేసి ఈ రిజర్వేషన్ను ఎవరు కూడా అడ్డుకోకూడదని, ఇన్నేళ్లుగా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉండేదని బాదపడ్డారు. ఇప్పుడిప్పుడే బీసీలకు న్యాయం జరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఈ బిల్లుకు అన్ని వర్గాల వారు, అన్ని పార్టీల వారు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. ఎవరు వ్యతిరేకించిన బీసీ ద్రోహులుగా మిలిగిపోతారనీ, ఈ బిల్లుకు ఎవరూ అడ్డుపడ్డ బీసీ సమాజం మరో ఉద్యమానికి వెనకాడదని అన్నారు.