Wednesday, August 6, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతాం: సీఎం రేవంత్‌ రెడ్డి

బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతాం: సీఎం రేవంత్‌ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : దేశానికి ఆదర్శంగా నిలిచేలా తెలంగాణలో కులగణన జరిగిందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారని గుర్తు చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద జరుగుతున్న బీసీ ధర్నాలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతామని సీఎం అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ కులగణన చేపట్టామని అన్నారు. విద్య, ఉపాధి, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్ట సభల్లో తీర్మానం చేసి బిల్లులను గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపామని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల తంతును హైకోర్టు సెప్టెంబర్ 30లోపు పూర్తి ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. ఈ క్రమంలోనే బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం అనివార్యమైందని.. కేంద్రం వెంటనే వాటిని ఆమోదించాలని, అప్పటి వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు.

బిల్లులపై చర్చించేందుకు తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని రాష్ట్రపతిని కోరామని.. ఇప్పటి వరకు వారు స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించకపోతేన ప్రధాని నరేంద్ర మోడీనిని గద్దె దింపుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -