నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలంలో నేర నియంత్రణలో నిరంతరం ముందుంటామని ఎస్సై అరుణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.పెద్దకొడప్ గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత రెండు నెలల క్రితం మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో రాత్రిపూట తాళం పగలగొట్టి దొంగతనం చేసిన వ్యక్తిని చాకచక్యంగా పట్టుకొని జైలుకు పంపడం జరిగింది ఆయన తెలిపారు.
రాత్రిపూట గస్తీ, పెట్రోలింగ్ వ్యవస్థలను పెంచామని ఆయన అన్నారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను పట్టుకుని కేసు నమోదు చేయడం జరిగింది అని, మండల పరిధిలో ఆరు పేకాట స్థావరాలపై దాడి చేసి పట్టుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది అని ఆయన పేర్కొన్నారు. మండల పరిధిలోఎలాంటి అవాంఛనీయ సంఘటనలు,చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగిన వెంటనే పెద్ద కొడప్గల్ పోలీస్ స్టేషన్ నంబర్ 8712666227 కు ఫిర్యాదు చేయాలని, అత్యవసర సమయంలో డైల్ 100 కి ఫోన్ చేయాలని ఎస్సై అరుణ్ కుమార్ సూచించారు.
నేర నియంత్రణలో ముందుంటాం: ఎస్సై
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES