Monday, October 6, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనిరసనకారుల డిమాండ్‌ను పాటిస్తాం : నేపాల్‌ ప్రధాని

నిరసనకారుల డిమాండ్‌ను పాటిస్తాం : నేపాల్‌ ప్రధాని

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :   అవినీతిని అంతం చేయాలనే నిరసనకారుల డిమాండ్లను పాటిస్తామని నేపాల్‌ తాత్కాలిక ప్రధాని సుశీల్‌ కర్కి ప్రతిజ్ఞ చేశారు. ఆదివారం సింఘా దర్బార్‌లోని ప్రభుత్వ భవనంలో జరిగిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సమావేశం ప్రారంభానికి ముందు .. హింసాకాండలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. రెండు రోజుల నిరసనల్లో సుమారు 72మంది మరణించారని, 191మంది గాయపడ్డారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏకనారాయణ్‌ ఆర్యల్‌ తెలిపారు.   కేబినెట్‌ ఏర్పాటుపై జెన్‌-జెడ్‌ ప్రతినిధులతో నేడు చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. హోంశాఖ, విదేశాంగశాఖ, రక్షణ శాఖలు కర్కి చేతుల్లోనే ఉండనున్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -