అఖిల్ రాజ్, తేజస్వీ రావు జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. సాయిలు కంపాటి దర్శకుడు. డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై దర్శకుడు వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు తెలంగాణ గద్దర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, స్పెషల్ జ్యూరీ, బెస్ట్ సింగర్ విభాగాల్లో నాలుగు అవార్డులను దక్కించుకుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని చిత్ర బృందంతో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ గురువారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ,’తండ్రి ఆవేదనని, ప్రేమికుల భావోద్వేగాలిని చాలా సహజసిద్ధంగా తెరపై ఆవిష్కరించారు’ అని తెలిపారు. ‘ఇప్పటి వరకు మాకు లభించిన అవార్డులు, ప్రశంసలకంటే క్రిటిక్స్ అభినందించడం పెద్ద అవార్డుగా భావిస్తున్నాం. మరింత బాధ్యతతో మరిన్ని మంచి సినిమాలని నిర్మిస్తాం’ అని దర్శకుడు, నిర్మాత వేణు ఊడుగుల చెప్పారు. సమర్పకులు నాగేశ్వరరావు పూజారి మాట్లాడుతూ,’మంచి మనసుతో మంచి చిత్రానికి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అభినందించడం చాలా మంచి విషయం’ అని తెలిపారు. దర్శకుడు సాయిలు కంపాటి మాట్లాడుతూ,’సినిమా ఆడి ప్రొడ్యూసర్‌కు డబ్బులు వస్తే చాలు అనుకున్నా. అవార్డ్స్ అనేది నాకు బోనస్’ అని అన్నారు.
మరింత బాధ్యతతో మంచి సినిమాలు చేస్తాం
- Advertisement -
- Advertisement -



