Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మా కుల దేవత భూమిని కాపాడుకుంటాం..

మా కుల దేవత భూమిని కాపాడుకుంటాం..

- Advertisement -

– 5వరోజు దీక్షలో డాక్టర్ అంకూరి నాగార్జున మాదిగ
నవతెలంగాణ – ఊరుకొండ 

మాదారం గ్రామ కులదేవత అయిన ఎల్లమ్మ దేవాలయ భూమిని మాదిగలంతా ఏకమై పోరాటం చేసి కాపాడు కోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గుడిగానిపల్లి రాజుమాదిగ, డాక్టర్ నాగార్జునమాదిగ లు అన్నారు. బుధవారం ఊరుకొండ మండలంలోని మాదారం గ్రామ శివారులోని సర్వే నెంబర్ 628/2లో ఒక ఎకరా భూమిని ఇదే గ్రామానికి చెందిన మహమ్మద్ జాంగీర్ అనే వ్యక్తి గత 40 సంవత్సరాల క్రితం మా కుల దేవత రేణుక ఎల్లమ్మ దేవాలయ భూమి కి ఇవ్వడం జరిగిందని, ఇదే గ్రామానికి చెందిన కోమటి అనంతరాములు మరియు జనంపల్లి నర్సిములు అనే ఇద్దరితో మా పెద్దలు డబ్బులకు కొనుకోవడం జరిగిందని తెలిపారు. నాటి నుండి నేటి వరకు మా మాదిగలము మోఖ మీద ఉన్నామని చెప్పారు.

ఇట్టి స్థలంలో గుడి నిర్మాణం చేస్తుంటే కోమటి వాళ్ళు మాది స్థలం అని దౌర్జన్యంతో అక్రమంగా పేకు డాక్యుమెంట్ సృష్టించి పోలీస్ అధికారులకు చూయించి అక్రమంగా మా మాదిగ యువకుల పై కేసులు పెట్టడం జరిగిందని విమర్శించారు. ఇట్టి విషయాన్నీ ఊరుకొండ తహసిల్దార్ యూసుఫ్ అలీని సంప్రదిస్తే మేము కేసులు పెట్టాలని ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వివరణ ఇచ్చినట్లు తెలిపారు. ఊరుకొండ ఎస్సై బడా నాయకులకు తలొగ్గి ఏ ప్రాతిపదికన మాదిగ యువకులపై కేసులు నమోదు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తక్షణమే అక్రమ కేసులు ఎత్తివేసి.. మాదిగలను భయబ్రాంతులకు గురిచేయడం సరికాదని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గుడిగానిపల్లి రాజుమాదిగ, బీజేపీ నియోజకవర్గం అధ్యక్షులు శ్రీకాంత్ ముదిరాజ్, మాదిగల ఆరాధ్య దైవం మా కుల దేవత రేణుక ఎల్లమ్మ దేవాలయ భూమిని పోరాటాలతో సాధించుకుంటామని.. ఈ భూమి విషయంలో అన్యాయం పక్షాన నిలబడే అధికార పార్టీ నాయకుల దురుబుద్దిని మార్చుకొని న్యాయం పక్షాన నిలబడి ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకోవాలని.. లేకపోతె ఆ తల్లి ఆగ్రహానికి గురికాక తప్పదు అని గుర్తు చేశారు.

కార్యక్రమంలో బీఎస్పీ నవాబ్ పేట అధ్యక్షులు సూర్యనాయక్, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు, పెద్దాపుల్లని రాజు మాదిగ, గ్రామ పెద్దలు ఎర్ర లక్ష్మయ్య, చిన్న జంగయ్య, ఎర్రయ్య, వార్డ్ సభ్యులు అంకూరి స్రవంతి, అంకూరి బాలమణి, అంకూరి నాగమ్మ, అంకూరి కృష్ణమ్మ, అంకూరి ఎల్లమ్మ, గ్రామ బీఎస్పీ నాయకులు అంకూరి ఉస్సేన్, అంకూరి అర్జున్, హరీష్, అంకూరి పరుశురాం, అంకూరి హన్మంత్, అంకూరి నర్సింహా, అంకూరి బంధీగయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -