Wednesday, March 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిదేశీ ఉన్నత విద్య ఉపకారవేతనాలు చెల్లిస్తాం

విదేశీ ఉన్నత విద్య ఉపకారవేతనాలు చెల్లిస్తాం

- Advertisement -

– శాసనసభలో మంత్రి అడ్లూరి లక్షణ్‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థులకు ఉపకార వేతనాలను చెల్లిస్తామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తెలిపారు. శాసనసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం గత రెండున్నర ఏండ్లలో 4944 మందికి విదేశీ విద్యకు ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈబిసి, మైనారిటీ విద్యార్థులకు రూ.607.49 కోట్ల ఉపకారవేతనాలను అందించింది. డా.బిఆర్‌ అంబేడ్కర్‌ ఓవర్‌సీస్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి రూ.20 లక్షల వరకు ఉపకారవేతనం అందిస్తున్నాం. ఈ ఏడాది 520 మంది విద్యార్థుల ఉపకారవేతనాల చెల్లింపు ప్రక్రియ ప్రాసెస్‌లో ఉంది. ఇందుకోసం ఇప్పటికే రూ.53.26 కోట్లను కేటాయించాం. వీలైనంత త్వరగా ఉపకారవేతనాలను చెల్లిస్తామని మంత్రి తెలిపారు. ఈ సందర్బంగా బిఆర్‌ఎస్‌ సభ్యుడు కేటీఆర్‌ మాట్లాడుతూ..’ విదేశీ విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు నేరుగా మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం ఇవ్వాల్సిన ఉపకారవేతనాలు ఇవ్వలేదు. యూనివర్శిటీలో ఫీజులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నాం. శాసనసభలో ఈ సమస్యను ప్రస్తావించాలని విద్యార్థులు కోరారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా గ్రీన్‌ చానల్‌ ద్వారా స్కాలర్‌షిప్‌లు చెల్లించాలని కోరుతున్నాను’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -