నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
హైదరాబాద్‌లో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో తనను కలిసిన పలువురు జర్నలిస్టులతో సీఎం మాట్లాడారు. ఇందుకోసం సొసైటీల పేరుతోకాకుండా జర్నలిస్టు లంతా ఏకాభిప్రాయానికి రావాలని సీఎం కోరారు. ఫోర్త్ సిటీలో ఇంటి స్థలాలు కేటాయించేందుకు సుముఖంగా ఉన్నామనీ, సమాచారశాఖ మంత్రి పొంగులేటితో చర్చించి ఒక ప్రతిపాదనతో వస్తే ప్రభుత్వం అంగీకరిస్తుందన్నారు. కోర్టుతీర్పు తర్వాత పాత స్థలాలు ఇవ్వలేమనీ, అర్హులైన అందరికీ కలిపి ఇచ్చే ప్రతిపాదన చేస్తున్నామని వివరించారు. జేఎన్‌జేతోపాటు ఇతర జర్నలిస్టులకు న్యాయం చేస్తామని చెప్పారు.
జర్నలిస్టుల ఇండ్లస్థలాల సమస్యను పరిష్కరిస్తాం:సీఎం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



