Wednesday, January 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకృష్ణా జలాలపై త్వరలో అన్ని విషయాలూ మాట్లాడతా

కృష్ణా జలాలపై త్వరలో అన్ని విషయాలూ మాట్లాడతా

- Advertisement -

– ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌ :
కృష్ణా జలాలపై త్వరలో అన్ని విషయాలు మాట్లాడతానని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్‌టీిఆర్‌ అభిమాన సంఘాల సమాఖ్య మాజీ అధ్యక్షడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వికలాంగుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిన్నమనేని సాయిబాబా ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. విదేశీ పర్యటన ముగించుకుని ఆదివారం హైదరాబాద్‌ వచ్చిన సీఎం చంద్రబాబు విమానాశ్రయం నుంచి నేరుగా సికింద్రాబాద్‌లోని సాయిబాబా నివాసానికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతి సందర్భంలోనూ స్వాగతం పలికి, టీడీపీ విధేయుడుగా పనిచేసిన వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో వికలాంగుల కమిటీ చైర్మన్‌గా సేవలందించడం అభినందనీయమన్నారు. సాయిబాబా కుటుంబం సమస్యల్లో ఉన్నట్లు తెలిసిందని, వారిని ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సాయిబాబా ఇంటి వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులతో చంద్రబాబు మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదంపై త్వరలోనే అన్ని విషయాలు చెబుతానని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -