– ఆధునిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తాం
– ఇంజినీరింగ్ నిపుణుల నియామకం
– పూర్తిస్థాయిలో సంస్కరణలు : సమీక్షలో మంత్రి ఉత్తమ్ ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
నీటిపారుదల శాఖ సెంట్రల్ డిజైన్ విభాగం పటిష్ఠతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ ఉదంతంలో జాతీయ భద్రత సంస్థతో పాటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చేసిన వ్యాఖ్యలతో సీడీవో ప్రతిష్ట దెబ్బతిన్నదని ఆయన వ్యాఖ్యానించారు. వీటిపై సీడీవో పున్ణసమీక్షించుకుని సంస్కరణలు చేపట్టడం అత్యవసరమని చెప్పారు. ఇందుకు అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తామన్నారు.
మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన విస్తత స్థాయి సమావేశం నిర్వహించారు.నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీలు అంజద్ హుస్సేన్, రమేష్‌బాబుతో పాటు నీటిపారుదల శాఖ సంయుక్త కార్యదర్శి కె శ్రీనివాస్, సీడీవో సీఈ యం.సత్యనారాయణరెడ్డి, సీఈలు అజరుకుమార్, మధుసూదన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా డిజైన్ల విభాగాన్ని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ముఖ్యంగా ప్రాజెక్టు డిజైన్ల రూపకల్పనలో ఆధునిక పరిజ్ఞానాన్ని అందు బాటులోకి తీసుకురావాలన్నారు.
అందుకు అవసరమైన తాజా సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో ముందుండాలని చెప్పారు. ఒకప్పుడు సీడీవో తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారత దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. వందేండ్ల క్రితం నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి మొదలెడితే తెలుగు రాష్ట్రాలలో నిర్మించిన ప్రధాన ప్రాజెక్ట్ నిర్మాణాలలో వినియోగించిన సాంకేతికత తెలంగాణ సీడీవో ప్రతిభకు పట్టం కడుతుందన్నారు. అలాంటి ప్రతిభ చాటుకునేందుకు సీడీవో కషి చేయాలని హితవు పలికారు. అలాంటి విశ్వసనీయత గలిగిన సంస్థకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగకుండా చూస్తామనీ, లోపాలు సరిచేసి అదే ప్రతిష్టను ఇనుమడింప చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అదే సమయంలో సీడీవోలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తక్షణం చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటిం చారు. అన్నీ స్థాయిల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం సంస్థను బలోపేతం చేయడంలో భాగమేనని గుర్తుచేశారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఐఐటీ హైదరాబాద్, జేఎన్‌టీయూ, టీఎస్ జెన్‌కో వంటి సంస్థలకు చెందిన వారిని నియమించే ముందు టైంబౌండ్ పద్ధతిలో డిజైన్ల రూపకల్పన, ఉత్తమ నైపుణ్యాలను ప్రదర్శించడంతో పాటు సమయపాలనకు పెద్దపీట వేయాలన్నారు.
నెల్లికల్లు, డిండి ఎత్తిపోతల పధకాలపై..
నల్లగొండ జిల్లాలో నెల్లికల్లు, డిండి ఎత్తిపోతల పధకాల డిజైన్లను త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి చెప్పారు. ఆలస్యమయ్యే కొద్దీ రైతులకు నీరందించడంలో జరుగుతున్న జాప్యాన్ని దష్టిలో పెట్టుకుని డిజైన్లను తక్షణం ఆమోదించాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు.
సెంట్రల్ డిజైన్ విభాగాన్ని పటిష్టం చేస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES