మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెరిక శ్రీనివాస్
నవతెలంగాణ – నసురుల్లాబాద్
రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషిచేస్తోందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నసురుల్లాబాద్ మండలంలోని కంశేట్ పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. మండలంలోని లింగంపల్లి, రాముల గుట్ట తండా, కంశేట్ పల్లి, దుర్కి హరిజన, అంకోల్, అంకోల్ క్యాంప్ ప్రాథమిక పాఠశాలలకు ఎన్.ఆర్.జి.ఎస్ పథకం కింద రెండు లక్షల రూపాయలతో నిర్మిస్తున్న మరుగుదొడ్ల స్థలాలను అధికారులు ప్రజాప్రతినిధులు పరిశీలించారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ మాట్లాడుతూ.. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారని శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు లేని పాఠశాలను గుర్తించి మరుగుదొడ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. మంజూరైన మరుగుదొడ్లను త్వరలో పనులు ప్రారంభమవుతాయని, ప్రభుత్వ పాఠశాలలో నిర్మాణం జరిగే మరుగుదొడ్లను నాణ్యత ప్రమాణాలతో కూడిన పనులు చేపట్టాలని అధికారులను సూచించారు. ప్రభుత్వ పాఠశాలల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూత్రశాలలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.
కొత్త గ్రామ పంచాయతీ భవనాలకు నిధులు
మండలంలో ఉన్న 19 గ్రామపంచాయతీలో పలుచోట్ల శిథిలవస్థకు చేరిన గ్రామపంచాయతీ భవనాలకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ఒక్కొక్క పంచాయతీ భవనానికి సుమారు 20 లక్షల రూపాయలతో నిధులు మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు. ఇందులో కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీ భవన నిర్మాణాల కోసం స్థల పరిశీలన చేయడం జరిగిందన్నారు ఇందులో భాగంగా కంషేట్ పల్లి గ్రామంలో పంచాయతీ భవన నిర్మాణం కోసం స్థలం పరిశీలన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల శ్రీనివాస్, మాజీ జిల్లా కోఆప్షన్ మెంబర్ మజీద్, గ్రామ సర్పంచ్ సాయ గౌడ్, పంచాయతీరాజ్ అధికారులు గోపీనాథ్, నాయకులు ప్రతాప్ సింగ్, జగదీశ్, మహబూబ్, తదితరులు పాల్గొన్నారు.



