– లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– ఇందిరమ్మ ఇళ్ళను త్వరితగతిన పూర్తి చేయాలి
– రాంపూర్ తిమ్మాపూర్ తపాలాపూర్ చింతగూడ గ్రామాల్లో ముంపు, ప్రాంతాలను పంట నష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వెడమ బొజ్జు పట్టేల్
నవతెలంగాణ – జన్నారం
కురుస్తున్న అధిక వర్షాలకు పంట నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకుంటామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమా బొజ్జు పటేల్ అన్నారు. గురువారం జన్నారం మండలంలోని రాంపూర్ తిమ్మాపూర్ తపాలాపూర్ చింతగూడ గ్రామాల్లో, పర్యటించి, అధిక వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాపై ప్రత్యేక సిద్ధ తీసుకొని అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ కురుస్తున్న వర్షాలు వరద ప్రభావిత ప్రాంతాల గురించి తెలుసుకుంటున్నారన్నారు.
ప్రజలకు ఎలాంటి ప్రాణ హాని జరగకుండా వరదల పట్ల అప్రమత్తంగా అధికారులకు సూచనలు జారీ చేస్తున్నారన్నారు. రాంపూర్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వరద నీరు చేరి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందికరంగా మారడంతో పరిశీలించిన ఎమ్మెల్యే సమస్యను పరిష్కరిస్తామన్నారు. అనంతరం అదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండను పరిశీలించారు. మొదటి విడతలో వచ్చిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మూడు నెలల్లో పూర్తి చేసుకోవాలన్నారు. లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు త్వర త్వరగా నే పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. తిమ్మాపూర్ గ్రామంలో గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు.
పత్తి మొక్కజొన్న మిర్చి పసుపు ఇతర పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. గ్రామాల్లో అధిక వర్షాలతో వరదలతో కొట్టుకపోయిన నాలిలను రోడ్లను నూతనంగా నిర్మిస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గ్రామాల్లో లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంట వెంటనే సంబంధిత అధికారులకు తెలపాలని సూచించారు. తపాలపూర్ చింతగూడ గ్రామాల్లో పంట నష్టాన్ని పరిశీలించారు… కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముసాఫర్ అలీ ఖాన్, ఎంపీడీవో ఉమర్ షరీఫ్, డైరెక్టర్ ప్రదీప్, మాజీ సర్పంచ్ సుధాకర్ నాయక్, కార్యదర్శి లావణ్య పద్మారావు, శ్రీనివాస్ గుగులవత్ రవి, చిందం చంద్రయ్య వెంకటస్వామి చిన్నయ్య, జాడి రవి శాంతయ్య సత్యనారాయణ, జగన్, పాల్గొన్నారు.