Wednesday, April 1, 2026
E-PAPER
Homeజిల్లాలుబుసిరెడ్డి చేస్తున్న సేవలకు తోడ్పాటు అందిస్తాం

బుసిరెడ్డి చేస్తున్న సేవలకు తోడ్పాటు అందిస్తాం

- Advertisement -


నవతెలంగాణ -పెద్దవూర
బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండు రంగారెడ్డి చేస్తున్న సేవలకు గ్రామ ప్రజలు అందరూ తోడ్పాటు అందిస్తామని ఉట్లపల్లి ఉపసర్పంచ్ బీరెడ్డి బాల్ రెడ్డి అన్నారు. బుధవారం మండలం లోని ఉట్ల పల్లి గ్రామం లో బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ బుసిరెడ్డి పాండన్నా ధాతృత్వంతో గ్రామం లో 19 మంది దివ్యాంగులకు సధరన్ సర్టిఫికెట్ల ద్వారా వచ్చిన బస్ పాసులను గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాసుదేవుల రవీందర్ రెడ్డితో కలిసి దివ్యాంగులకు బస్ పాసులు పంపిణి చేసి మాట్లాడారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అన్నీ మండలాలు గ్రామాల్లో బుసిరెడ్డి పౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు.

బడుగు బలహీన వర్గాల ప్రజలకు, విద్యార్థులకు, వృద్ధ దివ్యాంగులకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. అదేవిదంగా నియోజకవర్గం లోని ఏ గ్రామం లో ఎవరి ఇంట్లో నైనా ఎవరైనా మృతి చెందినా వెంటనే స్పందించి ఆరోజు అక్కడికి వచ్చిన బంధువులకు ఆత్మబంధు ద్వారా 100 నుంచి 200 వరకు ఉచితంగా భోజనాలు పంపిస్తున్నారని అన్నారు. నిరుపేద విద్యార్థుల వున్నత చదువులకు, దేవాలయాల నిర్మాణాలకు ఆర్థిక సహాయం చేస్తూ ప్రజలకు చేరువాయ్యారని అన్నారు. అందుకే ఆయన చేస్తున్నా సేవాతత్పరతకు మా గ్రామ ప్రజల తోడ్పాటు అందిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -