Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బొప్పాస్ పల్లి సీడ్ భూములను సర్వే చేస్తాం..

బొప్పాస్ పల్లి సీడ్ భూములను సర్వే చేస్తాం..

- Advertisement -

బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి 
నవతెలంగాణ- నసురుల్లాబాద్ 

కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం బొప్పాస్‌పల్లిలోని వ్యవసాయ క్షేత్రం భూములను సమగ్ర సర్వే చేసి సిడి యాజమాన్యం కు గ్రామస్తుల గుట్టకు న్యాయం చేస్తామని బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి తెలిపారు. మంగళవారం నసురుల్లాబాద్ మండలంలోని బొప్పాస్ పల్లి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ విత్తన అభివృద్ధి క్షేత్రం సుమారు 500 పైగా ఎకరాల్లో వ్యవసాయ విత్తన అభివృద్ధి క్షేత్రం ఏర్పాటు చేశారు.

ఇందులో కొందరికి గతంలో పట్టా పాస్బుక్కులు ఇవ్వడంతో లబ్ధిదారులు వ్యవసాయం చేసుకుంటున్నారు. అలాగే మరో 20 ఎకరాలకు పైగా భూమి వివాదాస్పదంగా. ఇందులో కొందరికి పట్టా పాస్ బుక్కులు ఉండడం, తమ భూములను తాము సాగు చేసుకుంటామంటే వ్యవసాయ అధికారులు అడ్డుకుంటున్నారని సబ్ కలెక్టర్ ముందు రైతులు తెలిపారు. అందరి సమస్య పరిష్కరిస్తామని పూర్తిస్థాయిలో సర్వే చేసి అందరికి న్యాయం చేసే విధంగా ఉంటుందన్నారు. సర్వేకు అందరూ సహకరించాలని ఆమె సూచించారు. సర్వే అధికారులను ఎవరు అడ్డుకున్నా అడ్డుకున్న చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు తహసిల్దార్ సువర్ణ, వ్యవసాయ క్షేత్రం అధికారి అనిల్ కుమార్, గ్రామ సర్పంచ్ లక్ష్మీ బలరాం సింగ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -