Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్భట్టుపల్లి శ్రీనివాస్ ఆశయాలను ముందు తీసుకెళ్తాం..

భట్టుపల్లి శ్రీనివాస్ ఆశయాలను ముందు తీసుకెళ్తాం..

- Advertisement -

జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్..
నవతెలంగాణ – భువనగిరి
: అమరజీవి భట్టుపల్లి శ్రీనివాస్ ఆశయాలను ముందు తీసుకెళ్తామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ తెలిపారు. ఆదివారం  అమరజీవి బట్టుపల్లి శ్రీనివాస్ 14వ వర్ధంతి ని పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పతన కార్యదర్శి మాయకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సభలో జహంగీర్ మాట్లాడారు. బట్టుపల్లి శ్రీనివాస్ విద్యార్థి ఉద్యమం కి ఆకర్షితులై విద్యార్థి నాయకుడిగా కార్మిక నాయకునిగా, సీపీఐ(ఎం)  పట్టణ కార్యదర్శిగా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా పట్టణంలో ఉన్నటువంటి పీడిత ప్రజల హక్కుల కోసం  పనిచేశారన్నారు. పేదల కోసం, ఇంటి స్థలాల కోసం, ఇంటి నిర్మాణం కోసం పోరాటాలు  నడిపినటువంటి బట్టుపల్లి శ్రీనివాస్ ఆశయాలను ఆశయ సాధన కోసం సీపీఐ(ఎం)  పట్టణ కమిటీ ముందుకు పోవాలని  కోరారు. ఆ తర్వాత కౌన్సిలర్ గా ఎన్నికైన కార్మిక సమస్యల కోసం, గ్రామీణ వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం సుదీర్ఘమైన పోరాటాలు చేశారన్నారు. స్థానిక సమస్యలపై పట్టణంలోని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ అధికారులు హామీలు అమలు చేయక నిరాశతో గురి అయిన పట్టణంలోని ప్రజలను  ఉద్యమాల వైపుకు నడిపించారన్నారు. మున్సిపల్ ఆఫీస్ ముందు అమర నిరాహార దీక్ష  చేపట్టారు. అమర నిరాహార దీక్షకు అధికారులు స్పందిస్తూ శిబిరానికి ప్రభుత్వం అధికారులు శిబిరానికి చేరుకొని ఇంటి స్థలాల కోసం హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగానే సింగన్నగూడెం ఇందిరమ్మ కాలనీలో, హుస్నాబాద్ ఇందిరమ్మ కాలనీలో ఈ రెండు కాలనీలో ఇంటి పట్టాలను అమర నిరాహార దీక్ష వలన సాధించడం జరిగిందన్నారు.  సర్వే నెంబర్ 700  మొదుగుంపల్లి రోడ్ లో 105 మందికి పట్టాలు ఇచ్చరని తెలిపారు. కానీ స్థలం చూపించలేదన్నారు. అమరజీవి బట్టిపల్లి శ్రీనివాస్ ఆశయ సాధన కోసం 700 సర్వే నెంబర్ లోని పేదలను గుడిసెలు వేసుకోవాలని సిపిఐఎం పార్టీ ముందుండి పోరాటాలకు ముందుకు పోవాలని జహంగీర్  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టి పల్లి శ్రీనివాస్ సతీమణి బట్టి పల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, దాసరి పాండు, బీఎస్పీ నాయకులు బట్టు రామచంద్రయ్య, జిల్లా నాయకులు దయ్యాల నరసింహ, సిర్పాంగి స్వామి, ప్రజానాట్యమండలి  జిల్లా కార్యదర్శి ఈర్ల ముత్యాలు, పట్టణ కార్యవర్గ సభ్యులు గంధమల మాతయ్య, బందెల ఎల్లయ్య, కల్లూరి నాగమణి, వోల్దాస్ అంజయ్య, బర్ల వెంకటేష్, దండుగిరి, చింతల శివ, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఈర్ల రాహుల్, కొత్త లలిత, దండు పద్మారావు, దండు యాదగిరి, ఆడపు యాదగిరి, గంధ మల్ల బాలమణి, దండు స్వరూప, దండు హేమలత, గౌటి మంగా, భట్టి పల్లి నవీన్ కుమార్, దండు దినేష్, బట్టుపల్లి సాయి, బట్టుపల్లి వినయ్, బట్టు కొండయ్య  పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad