కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు
నవతెలంగాణ – మద్నూర్
ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే ముస్లింలకు సంక్షేమ ఫలాలు లభిస్తాయని మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు అన్నారు. మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామంలో రంజాన్ పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫా దుస్తులను నిరుపేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లింలకు సంక్షేమ ఫలాలు అందించడం లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. ఈ తోఫా పంపిణీ కార్యక్రమంలో సుల్తాన్ పేట్ గ్రామ ముస్లిం నాయకులు దావూద్ పటేల్ , సలీం, అబ్భూ, ఆ గ్రామ ముఖ్య నాయకులు నీవర్తి మద్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు సంఘయప్ప వీరితో పాటు తోఫా అందుకున్న నిరుపేద ముస్లింలు పాల్గొనారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే ముస్లింలకు సంక్షేమ ఫలాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



