– క్రీడాకారులకు ప్రోత్సాహం.. ఆధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల ఏర్పాటు
– మైదానాల అభివృద్ధికి పెద్దపీట: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
– ఉప్పల్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
– బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట
నవతెలంగాణ-ఉప్పల్
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని, అభివృద్ధిలో రాజకీయాలకు తావు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం ఉప్పల్ నియోజకవర్గంలో రూ.115.85 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. ఉప్పల్ నల్లచెరువును రూ.20 కోట్లతో అభివృద్ధి చేసి సుందరీకరణ పనులు చేపట్టినట్టు చెప్పారు. రూ.30 కోట్లతో ఆధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు
బీఆర్‌ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట
మంత్రి పర్యటనలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట జరగడంతో కాస్త ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ‘జై బీఆర్‌ఎస్’, ‘జై కాంగ్రెస్’ అంటూ ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేస్తూ పరస్పరం తోపులాడుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇరుగ్రూపులను చెదరగొట్టారు. గతంలో రామంతపూర్ డివిజన్‌లో మంత్రి పర్యటనలో ఇలాంటి ఘటన జరగగా, ఇది రెండోసారి కావడం గమనార్హం.
సంక్షేమమే మా లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



