నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సనత్‌నగర్ టిమ్స్ నుంచి నెలరోజుల్లో రోగులకు వైద్య సేవలు ప్రారంభిస్తామని అక్టోబర్ 23న రాష్ట్ర సర్కారు ప్రకటించిందనీ, నెలరోజులైంది..వైద్యసేవలేమయ్యాయని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆదివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో గప్పాలు కొట్టడం తప్ప, టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తేవడంలో రేవంత్‌రెడ్డి చర్యలు శూన్యమని విమర్శించారు. టిమ్స్ ఆస్పత్రుల ప్రారంభంపై రెండేండ్లుగా డేట్లు, డెడ్‌లైన్లు మారుతున్నాయే తప్ప సేవలు అందట్లేదని ఎత్తిచూపారు. ప్రభుత్వ భూములను తెగనమ్మడంపై ఉన్న శ్రద్ధ, ప్రజలకు వైద్య సేవలు అందించే ఆస్పత్రుల మీద లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు వైద్యం అందించకుండా క్రిమినల్ నెగ్లిజెన్స్‌కు పాల్పడుతున్నదనీ, టిమ్స్ నిర్మాణాల్లో కమీషన్ల కోసం తాత్సార్యం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ తరపున తాము టిమ్స్ ఆస్పత్రిని సందర్శించి నెలన్నర గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి పేదలకు వైద్యసేవలందించాలని సూచించారు.
సనత్‌నగర్ టిమ్స్‌లో వైద్యసేవలేవి? :మాజీ మంత్రి హరీశ్‌రావు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



