Wednesday, April 30, 2025
Homeసినిమా'కిష్కింధపురి'లో ఏం జరిగింది?

‘కిష్కింధపురి’లో ఏం జరిగింది?


బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘కిష్కింధపురి’. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తుండగా, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి కౌశిక్‌ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు.
మంగళవారం ఈ చిత్ర ఫస్ట్‌ గ్లింప్స్‌ ఇప్పుడు విడుదలైంది. బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌ ఒక హాంటెడ్‌ హౌస్‌లోకి వెళ్ళడంతో కథ మొదలౌతుంది. ‘కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు’ అని టీజర్‌ సూచిస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ అహం మత్యువు అనే డైలాగ్‌ని ఇంటెన్స్‌గా చెప్పే టెర్రిఫిక్‌ మూమెంట్‌తో గ్లింప్స్‌ ముగుస్తుంది.
ఫస్ట్‌ గ్లింప్స్‌ స్పైన్‌ చిల్లింగ్‌ ప్రివ్యూను అందించింది. అలాగే టెక్నికల్‌గా విజువల్‌ వండర్‌గా ఉంది. దర్శకుడు కౌశిక్‌ పెగల్లపాటి గ్రిప్పింగ్‌ కథనం, చిన్మరు సలాస్కర్‌ అద్భుతమైన సినిమాటోగ్రఫీ, సామ్‌ సిఎస్‌ హంటింగ్‌ స్కోర్‌తో అదిరిపోయింది. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌ నిర్మాణ విలువలు గ్రాండ్‌గా ఉన్నాయి. అతీంద్రియ అంశాల డెప్త్‌ని ప్రజెంట్‌ చేసిన ఈ గ్లింప్స్‌ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మాన్సూన్‌లో ఈ చిత్రం థియేటర్లలోకి వస్తుందని మేకర్స్‌ ప్రకటించారు.
‘గతంలో హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ చేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా వైవిధ్యంగా ఉంటుంది. అలాగే ఇందులో ఆయన పోషించిన పాత్ర సైతం అందర్నీ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. కథానాయిక అనుపమ పరమేశ్వరన్‌ పాత్ర కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వీరిద్దరి పాత్రలను దర్శకుడు అద్భుతంగా సిల్వర్‌ స్క్రీన్‌ మీద ప్రజెంట్‌ చేస్తున్నారు. ఈ సినిమా మా బ్యానర్‌కి, అలాగే హీరో సాయిశ్రీనివాస్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలస్తుందనే నమ్మకం ఉంది. దర్శకుడు కౌశిక్‌ పెగల్లపాటి ఈ చిత్ర కథని మేం ఊహించినదాని కంటే చాలా బెటర్‌గా ప్రజెంట్‌ చేస్తున్నారు. కథ, కథనాలు, సంగీతం, నటీనటుల నటన ఈచిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ప్రేక్షకులను ఆద్యంతం సీట్‌ ఎడ్జ్‌లో కూర్చో బెట్టే సినిమా అవుతుందని ఆశిస్తున్నాం’ అని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం – సామ్‌ సిఎస్‌, డీఓపీ – చిన్మరు సలాస్కర్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ – మనీషా ఎ దత్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ – డి. శివ కామేష్‌, ఎడిటర్‌ – నిరంజన్‌ దేవరమానే, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – టి.సందీప్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img