Saturday, October 11, 2025
E-PAPER
Homeసినిమాఅలాంటిది.. మన ఫ్యామిలీలో జరిగితే?

అలాంటిది.. మన ఫ్యామిలీలో జరిగితే?

- Advertisement -

‘లవ్‌ టుడే, డ్రాగన్‌’లతో రెండు వరుస హిట్‌లను అందించిన హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ ‘డ్యూడ్‌’తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్‌ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్‌ సరసన మమిత బైజు నటించగా, శరత్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించారు. ఈనెల 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శరత్‌ కుమార్‌ మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు. కథలో ముఖ్య భాగమయ్యే పాత్రలు చేయడానికి ఇష్టపడతాను. డైరెక్టర్‌ కీర్తిశ్వరన్‌ ఈ కథ చెప్పినప్పుడు, ఇందులో కచ్చితంగా నటించాలని అనిపించడానికి కారణం కూడా ఇదే. కథ అద్భుతంగా ఉంది. ప్రదీప్‌కి అంకుల్‌గా కనిపిస్తాను. కథలో నా పాత్ర చాలా క్రూషియల్‌. చాలా కొత్త పాయింట్‌. ఒక ఫ్యామిలీలో ఇలాంటి ఒక మేటర్‌ జరిగితే సొసైటీ ఎలా రియాక్ట్‌ అవుతుందనే కోణంలో డైరెక్టర్‌ అద్భుతంగా ప్రజెంట్‌ చేశారు. ఇది రెగ్యులర్‌ సినిమాలా ఉండదు. ఇది చాలా ఎమోషనల్‌ ఫిల్మ్‌. కథలో మంచి కాన్ఫ్లిక్ట్‌ ఉంది.

కామెడీ హ్యుమర్‌, ఎమోషన్‌ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. పెర్ఫార్మెన్స్‌ చేయడం కూడా టఫ్‌. నా పాత్రలో చాలా డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయి. అలాగే నా క్యారెక్టర్‌కి ఉన్న రూల్స్‌, కండీషన్స్‌ భిన్నంగా ఉంటాయి. ఇందులో ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు మంచి కంటెంట్‌ ఉంది. చాలా కొత్త థాట్‌ ఉంది. ఆడియన్స్‌ చాలా కొత్తగా ఫీల్‌ అవుతారు. ప్రదీప్‌ ఆల్‌ రౌండర్‌. మంచి డైరెక్టర్‌, గుడ్‌ పెర్ఫార్మర్‌. ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్‌ హై ఎనర్జీతో ఉంటుంది. సాయి అభ్యంకర్‌ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. ఈ సినిమాకి తన మ్యూజిక్‌ బిగ్‌ ఎసెట్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ చాలా పెద్ద ప్రొడ్యూసర్స్‌. సినిమాని చాలా ప్యాషన్‌తో తీస్తారు. సినిమాని ప్రేమిస్తారు. సినిమాకి కావాల్సిన ప్రతీదీ ఎక్కడా రాజీపడకుండా సమకూర్చూరు. డైరెక్టర్‌కి కంప్లీట్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారు. సుభాస్‌ చంద్రబోస్‌ బయోపిక్‌ చేయాలని ఉంది. ‘మిస్టర్‌ ఎక్స్‌’ అనే సినిమా చేస్తున్నాను. బాలీవుడ్‌లో ఒకటి, అలాగే గౌతమ్‌ మీనన్‌ కాంబినేషన్‌లో మరో సినిమా ఉంది. నవంబర్‌లో ఓ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -