రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ”గల గల పారే గోదావరి గట్టుతో కళ కళలాడే అందమైన పల్లెటూరులో ఓ అమ్మాయిని చూడగానే తొలి చూపులోనే అబ్బాయికి ప్రేమ పడుతుంది. ‘ప్రేమ ఆ చూపుతో మొదలైంది.. కాలం బొమ్మలా ఆగిపోయింది ఆమెతో పాటే నా మనసు కూడా మాయమైంది’ అనే డైలాగ్ హీరోయిన్‌పై హీరోకి ఉన్న లవ్ డెప్త్ ఏంటో చెబుతోంది. ‘ప్రేమించాలని డిసైడ్ అయితే ఎన్నొచ్చిన యుద్ధం చేయాల్సిందే’ అని హీరోకి తండ్రి చెప్పటం చూస్తే ప్రేమలో హీరోకి ఎదురైన సమస్య గురించి తెలుస్తుంది.
అక్కడి నుంచి విలన్ పాత్ర ఎలా ఉండబోతుంది.. తన వల్ల హీరో పడ్డ ఇబ్బందులను ట్రైలర్‌లో చూపించారు. గోదావరి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలోని సన్నివేశాలు ట్రైలర్‌లోనే హదయాలను హత్తుకుంటుంటే సినిమాలో ఎమోషన్స్ ఎలా ఉండబోతున్నాయనే క్యూరియాసిటీ కలుగుతోంది. శరవణ వాసుదేవన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. సాయికుమార్ దారా అందించిన విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. గ్యారీ బి.హెచ్.ఎడిటింగ్ పనితనం అద్భుతంగా ఉంది’ అని చిత్ర బృందం తెలిపింది. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్, శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీత దర్శకుడు : శరవణ వాసుదేవన్, నేపథ్య సంగీతం :అనుదీప్ దేవ్, కెమెరామెన్ :శ్రీ సాయి కుమార్ దారా, ఎడిటర్ : గ్యారీ బీహెచ్, కాస్ట్యూమ్ డిజైనర్ :గౌరీ నాయుడు.
ప్రేమించాలని డిసైడ్ అయితే..?
- Advertisement -
- Advertisement -