Sunday, November 2, 2025
E-PAPER
Homeసినిమా'ఛాంపియన్‌' లక్ష్యం ఏంటి?

‘ఛాంపియన్‌’ లక్ష్యం ఏంటి?

- Advertisement -

హీరో రోషన్‌ నటిస్తున్న పీరియాడిక్‌ స్పోర్ట్స్‌ డ్రామా ‘ఛాంపియన్‌’. ప్రదీప్‌ అద్వైతం దర్శకుడు. జీ స్టూడియోస్‌ సమర్పణలో స్వప్న సినిమాస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ , కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే రోషన్‌, అనస్వర రాజన్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌, గ్లింప్స్‌ని విడుదల చేసిన మేకర్స్‌ తాజాగా టీజర్‌ని రిలీజ్‌ చేశారు.
‘స్వాతంత్య్రానికి ముందు హైదరాబాద్‌లో నివసించే ఆర్మీ మాన్‌, ఫుట్‌బాలర్‌ మైఖేల్‌ సీ.విలియమ్స్‌. మైదానంలో ప్రత్యర్థులను సవాలు చేస్తూ తన ప్రతిభను ప్రదర్శించే ఈ యంగ్‌మ్యాన్‌కి ఇంగ్లండ్‌లో రాణి ఎలిజబెత్‌ను కలుసుకునే అవకాశం దక్కుతుంది. దేశం కోసం ఆడే అవకాశమొచ్చినా, అతని మనసు మాత్రం తన ప్రేయసి వద్దే ఉంటుంది. కానీ జీవితం అతనికి మరిన్ని సవాళ్లు, భావోద్వేగాలు, యుద్ధం, ప్రేమ.. అన్నీ ఒకేసారి ఎదురు చూపిస్తుంది. ఫుట్‌బాలర్‌గా రోషన్‌ లుక్‌, హైదరాబాదీ యాసలో హిందీ మిక్స్‌ చేసిన అతని డైలాగ్‌ డెలివరీ చాలా నేచురల్‌గా, క్యారెక్టర్‌కి తగినట్టుగా ఉంది. అనస్వర రాజన్‌ అందంగా కనిపించింది. ఇద్దరి కెమిస్ట్రీ మనసుకు హత్తుకునేలా ఉంది. దర్శకుడు ప్రదీప్‌ అద్వైతం స్పోర్ట్స్‌, డ్రామా, యాక్షన్‌, రొమాన్స్‌, వార్‌ అన్నీ ఎలిమెంట్స్‌ లో అద్భుతమైన నారేషన్‌తో ఆకట్టు కున్నాడు. ప్రొడక్షన్‌ వాల్యూస్‌ అద్భుతంగా ఉన్నాయి. ప్రొడక్షన్‌ డిజైనర్‌ తోట తరణి ప్రీ-ఇండిపెండెన్స్‌ కాలాన్ని అద్భుతంగా రీక్రియేట్‌ చేశారు. సినిమాటోగ్రాఫర్‌ ఆర్‌. మధీ వండర్‌ ఫుల్‌ విజువల్‌ క్యాప్చర్‌ చేశారు. మిక్కీ జె. మేయర్‌ మ్యూజిక్‌ టెన్షన్‌, ఎమోషన్‌ రెండింటినీ అద్భుతంగా బ్లెండ్‌ చేశారు. ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు కట్టింగ్‌ ఎడ్జ్‌ ఎడిటింగ్‌తో పేస్‌ను మెయింటైన్‌ చేశారు. ఈ చిత్రం డిసెంబర్‌ 25న క్రిస్మస్‌కు విడుదల కానుంది’ అని చిత్రయూనిట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -