Sunday, May 11, 2025
Homeప్రధాన వార్తలుకిం కర్తవ్యం..

కిం కర్తవ్యం..

- Advertisement -

– పారదర్శకమా..? వ్యూహాత్మకమా…?
– అప్పులపై చర్చనీయాంశమైన సీఎం వ్యాఖ్యలు
– పథకాల అమలుపై పలు అనుమానాలు
– పెట్టుబడులపైనా తీవ్ర ప్రభావమంటున్న నిపుణులు
– అయోమయంలో ఆర్థికశాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

‘వస్తున్న ఆదాయం ప్రకారమే పనులు చేసుకుంటూ పోతా.. అంతకుమించి నన్ను కోసినా ఏం చేయలేను…’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశ మవుతున్నాయి. తమ ప్రభుత్వం అన్ని విషయాలో ్లనూ పారదర్శకంగా ఉందని చెప్పుకోవటానికే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తోం టే.. ‘పథకాలు అమలు చేయలేమంటూ’ ఆయన చెప్పకనే చెప్పారనీ, ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరిగిందని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ విమర్శలు గుప్పిస్తోం ది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు కొలువుదీరి 17 నెలలు గడిచిపోయింది. ఈ కాలంలో గత బీఆర్‌ఎస్‌ చేసిన అప్పులు, వడ్డీలకు సంబంధించి అసెంబ్లీలో శ్వేతపత్రాలు ప్రకటించటం, ఆ తర్వాత అనేక వేదికల మీద సీఎం సహా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యే లు వాటి గురించి పదే పదే ప్రస్తావించటం కొనసాగా యి. ఆ తర్వాత జరిగిన శాసనసభా సమావేశాల్లో సైతం వీటిపై అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇదంతా అయిపో యిన తర్వాత కూడా మళ్లీ ఇప్పుడు అప్పులు, వాటికి కడుతున్న వడ్డీల గురించి ముఖ్యమంత్రి ప్రస్తావిం చటం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల్లో ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ మినహా మిగతావేవీ అమలు కాలేదని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆసరా పింఛన్ల పెంపు, కొత్త పింఛన్ల అమలు, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం, మహిళలకు నెలకు రూ.2,500 సాయం, రైతు భరోసా (రైతు బందు) కింద ఎకరాకు ఇచ్చే మొత్తాన్ని రూ.5 వేల నుంచి రూ.7,500కు పెంపు, ఆడ పిల్లలకు తులం బంగారం, చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు తదితరాలు కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు. వీటన్నింటినీ అమలు చేయాలంటే ఇప్పటికిప్పుడు రూ.50 వేల కోట్లు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇది ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. ఈ క్రమంలోనే హెచ్‌సీయూ భూముల వ్యవహారం ముందుకొచ్చింది. వాటిని వినియోగించ టం ద్వారా రూ.10 వేల కోట్లను సమకూర్చుకోవా లని ప్రభుత్వం భావించింది. అయితే ఈ వ్యవహారం వివాదాస్పదం కావటం, దానిపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించటం తదితర పరిణామాలు తెలిసినవే. సరిగ్గా ఇదే సమయంలో ఉద్యోగ సంఘా లు కూడా సర్కారుకు అల్టిమేటం ఇచ్చాయి. రిటైరైన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్‌తోపాటు తమ ఇతర డిమాండ్లను కచ్చితంగా పరిష్కరించాలని కోరా యి. దీంతో సర్కారుకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. ఇప్పుడు ఈ పరిస్థితి ఆర్థికశాఖ కు సంకటంగా మారింది. అనుభవజ్ఞుడైన ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు… సీఎస్‌గా పదోన్నతి పొందటంతో ‘మనీ మేనేజ్‌మెంట్‌’ ‘సిచ్యుయేషన్‌ను బ్యాలెన్స్‌ చేయటం’ కష్టంగా మారిందని సమాచారం. ఒకవైపు పథకాలను అమలు చేయలేకపోవటం.. మరోవైపు పెట్టుబడులను ఆకర్షించటం కూడా కష్టమేనంటూ పలువురు అధికారులు వాపోతున్నారు. దావోస్‌, జపాన్‌కు వెళ్లి పెట్టుబడులు పెట్టాలంటూ ప్రభుత్వం కోరినప్పటికీ…’మా దగ్గర పైసల్లేవ్‌…’ అనే వ్యాఖ్యలను చూసి, ఇన్వెస్టర్లు ఎలా ముందుకొస్తారంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఈ విపత్కర పరిస్థితి నుంచి ప్రభుత్వం ఎలా గట్టెక్కుతుందో చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -